BHPL: గోరికొత్తపల్లి(M) కోనరావుపేటలో మంగళవారం ఎస్సై దివ్య మహిళల రక్షణ, యువత మద్యం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు ఎటువంటి సమస్యలపైనా సంప్రదించాలని, శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు. బాధ్యతలు చేపట్టిన రెండో రోజే ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న ఎస్సై దివ్యను స్థానికులు అభినందిస్తున్నారు.