NRPT: కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి పంట పొలాలకు నీటిని విడుదల చేయడంతో వరి నాట్లు జోరందుకున్నాయి. ఈ ప్రాజెక్టు కింద ఎడమ కాలువ దేవరకద్ర మండలంలోని నాలుగు వేల ఎకరాలకు, కుడి కాలువ మరికల్, ధన్వాడ, చిన్న చింతకుంట మండలాల్లోని ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించనుంది.