SRPT: నాగారం మండలం వర్ధమానుకోటలోని KGBV పాఠశాల, జూనియర్ కళాశాలలో నూతనంగా ప్రవేశపెట్టిన ఇంటర్ కోర్సుల్లో మిగిలిన సీట్లకు ఈనెల 22 నుంచి 28 వరకు అడ్మిషన్లు తీసుకోనున్నట్లు ప్రత్యేక అధికారి ఎండీ. షిరీన్ సోమవారం తెలిపారు. Bi.P.C, MLT కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 10వ తరగతి ఒరిజినల్ మెమోతో కళాశాలలో సంప్రదించాలని సూచించారు.