SKLM: నగరంలో పోలీసులు, పోలీసు జాగిలం (డాగ్ స్క్వాడ్) సహాయంతో విస్తృతంగా తనిఖీలు, సోదాలు నిర్వహించారు. గంజాయి, అక్రమ మద్యం, పేలుడు పదార్థాల అక్రమ నిల్వలు రవాణాను అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం ఒకటవ, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆవరణ, పార్సిల్ సర్వీసులు, దుకాణాలలో సోదాలు జరిగాయని ఎస్సై రామారావు తెలిపారు.