SRCL: బోయినపల్లి మండలంలోని శ్రీరాజరాజేశ్వర (మిడ్మానేరు) ప్రాజెక్టు నీరు లేక వెలవెల బోతోంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటే ఉన్నాయి. రెండు నెలలుగా ముసురు తప్ప భారీ వర్షాలు కురవక ప్రాజెక్టుల్లో వరద చేరలేదు. ప్రాజెక్టులో ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు కేవలం 0.319 టీఎంసీల నీరు మాత్రమే చేరింది.