ASR: ఏజెన్సీలో ఆదివాసీలకు 100 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ నిరుద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల ఆదివాసీల మహాధర్నా సోమవారం ప్రారంభమైంది. పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట పలు గిరిజన, ఆదివాసీ ప్రజా సంఘాల నేతలు ధర్నాలో పాల్గొన్నారు. జీవో నెంబరు -3పై సీఎం చంద్రబాబు ఇచ్చిన పునరుద్ధరణ హామీ నెరవేర్చాలని వారు కోరారు.