NLR: జిల్లాలో యాక్సెస్ బ్యాంకులో కుబేర సినిమా తరహాలో రూ.10 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు అమాయకుల ఆధార్, పాన్ నంబర్లను ఏర్పాటు చేసుకొని వాటితో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు. బ్యాంకు వారిని సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా నమ్మించి ముత్తుకూరు, నెల్లూరు, కావలి బ్రాంచ్లలో రుణాలు తీసుకున్నారని అధికారులు తెలిపారు.