GNTR: నగరంలోని వీఐపీ రోడ్డుకు సమీపంలోని జోసెఫ్ నగర్ ఎలిమెంటరీ స్కూల్ వద్ద గత రాత్రి కురిసిన వర్షానికి స్కూల్ ఆవరణలో నీరు నిలిచిపోయింది. ఫలితంగా సోమవారం విద్యార్థులు వర్షపు నీటిలో నడుచుకుంటూ తరగతులకు వెళ్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఈ పరిస్థితిని పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.