ELR: ఏజన్సీ గ్రామాల్లో వర్షాకాలం కారణంగా విష జ్వరాలు ప్రబలకుండా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం కాపాడడానికి పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు నిర్వహించాలని తెలిపారు. ఇళ్లలో దోమలు చేరకుండా ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలి అని ఆయన సూచించారు