పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ వర్షాకాల సమావేశాలు విజయోత్సవ వేడుకలు’ అని పేర్కొన్న ఆయన, ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైనిక శక్తిని ప్రపంచం గుర్తించిందని తెలిపారు. భారత సైన్యం నిర్దేశించిన లక్ష్యాన్ని 100% సాధించిందని అన్నారు. ఉగ్రవాదుల యజమానుల ఇళ్లను కేవలం 22 నిమిషాల్లోనే మన సైనికులు నేలమట్టం చేశారని చెప్పారు.