TPT: తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగా విమానం సుమారు 40 నిమిషాలు గాల్లో తిరుగుతూ చివరికి తిరుపతిలోనే సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు విమానాశ్రయంలో ఆందోళనకు గురయ్యారు.