AKP: అనకాపల్లి జిల్లాలో ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమాన్ని ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు కోరారు. ఆదివారం సాయంత్రం అనకాపల్లి టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. జిల్లాలో 5,19,709 నివాసాలు ఉండగా ఇప్పటివరకు 2,00,479 నివాసాలను మాత్రమే ఈ కార్యక్రమంలో భాగంగా సందర్శించడం జరిగిందన్నారు.