KNR: మెడికల్ షాపులో చోరీ చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలోని గౌతమ్ మెడికల్ షాపులో ఈనెల 16న రూ. 3 వేల నగదు ఓ మొబైల్ చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బెంగాల్‌కు చెందిన సబ్బీర్ ఆలం, బిహార్‌కు చెందిన రిజ్వాన్ ఆలం, మొహమ్మద్ ఫర్హాన్ ఆలంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.