Harish Rao Satires : ప్రధాని మోదీపై మంత్రి హరీష్ రావు సెటైర్లు..!
Harish Rao : ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. ఆయన ఈ నెల 8వ తేదీన తెలంగాణ కు రానున్నారు. కాగా.. ఆయన పర్యటన నేపథ్యంలో... మోదీ పై మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. మోదీ పర్యటనపై ఎద్దేవా చేశారు. ఎయిమ్స్ లో నాలుగేళ్ల క్రితం మెడికల్ కాలేజీ వస్తే ప్రధాని మోదీ ఇప్పుడు వచ్చి కొబ్బరికాయ కొడతారట, ఈ నాలుగేళ్లు ఏం చేశారని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. ఆయన ఈ నెల 8వ తేదీన తెలంగాణ కు రానున్నారు. కాగా.. ఆయన పర్యటన నేపథ్యంలో… మోదీ పై మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. మోదీ పర్యటనపై ఎద్దేవా చేశారు. ఎయిమ్స్ లో నాలుగేళ్ల క్రితం మెడికల్ కాలేజీ వస్తే ప్రధాని మోదీ ఇప్పుడు వచ్చి కొబ్బరికాయ కొడతారట, ఈ నాలుగేళ్లు ఏం చేశారని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రధాని వస్తున్నారని బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు.
‘ఒక్క మెడికల్ కాలేజీకే ఇంత హడావుడి చేస్తున్నారు.. గతేడాది ఒకేసారి 8 మెడికల్ కాలేజీలకు కొబ్బరి కాయ కొట్టినం, మేమెంతగా చెప్పుకోవాలి’ అని మంత్రి అడిగారు. బీజేపీది పని తక్కువ ప్రచారం ఎక్కువ అని, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే బీజేపీ నేతల పని అని ఎద్దేవా చేశారు. తమది చేతల ప్రభుత్వమని మంత్రి చెప్పారు.
పనిచేసి ప్రజల మనసులు గెలుచుకోవాలని సీఎం కేసీఆర్ చెబుతుంటారని వివరించారు. 40 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో, 20 ఏళ్ల తెలుగుదేశం పాలనలో చేయని పనులను సీఎం కేసీఆర్ 8 ఏళ్లలోనే పూర్తిచేసి చూపించారన్నారు. మన దగ్గర కేసీఆర్ అనే అద్భుత దీపం ఉందని ముఖ్యమంత్రిపై పొగడ్తల వర్షం కురిపించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కంటి వెలుగు పథకం గురువారానికి కోటి మందికి చేరువైన సందర్భంగా సదాశివపెట్ లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.