సత్యసాయి: జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా పెనుకొండకు చెందిన ఎం. హరీశ్‌ను నియమిస్తూ పార్టీ నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. హరీశ్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.