SRPT: జూలూరి గౌరీ శంకర్ రచించిన బహుజనగణమన దీర్ఘకవిత పుస్తకాన్ని సోమవారం కోదాడ పట్టణంలోని కోర్టులో న్యాయవాదులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు పాలేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడాలని, తమ వాటా కోసం జనాభా నిష్పత్తి మేరకు విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో బీసీలకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.