NDL: వెలుగోడు పట్టణంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని వాటి నుండి ప్రజలను కాపాడాలని SDPI నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గౌస్ మోహియోద్దీన్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వెలుపుల జైపాల్‌కు వినతిపత్రం అందజేశారు. చిన్న, పెద్ద, వృద్ధులను సైతం వెంట పడి కరచి గాయ పరస్తున్నాయని వాపోయారు.