KDP: చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు అందించి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి వ్యాపారులకు సూచించారు. సోమవారం ప్రొద్దుటూరు పట్టణంలో పలు వార్డుల్లో కమిషనర్ పర్యటించారు. గాంధీ రోడ్డులోని మోర్ సూపర్ మార్కెట్ వద్ద మురికి కాలువలో పూడికను సిబ్బందితో తీయించారు. అర్చన హాల్ వద్ద మడూరు కాలువలో చెత్తను తొలగించాలని ఆదేశించారు.