WGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సత్య శారదకు ABSF, BSF విద్యార్థి సంఘాల నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి రెండో శనివారం సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరారు.