KRNL: సి.బెళగల్ మండలం చింతామాన్పల్లి, తిమ్మనదొడ్డి గ్రామాల్లో సోమవారం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయాలను ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.