ATP: గుంతకల్లు మండల తహసీల్దార్ రమాదేవి అధ్యక్షతన సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. అధికారులతో కలిసి ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఆమె అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరిస్తామని పేర్కొన్నారు.