KMM: అభివృద్ధి పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుమలాయపాలెం(M) అజ్మీరతండా, జల్లేపల్లి, హైదరాసాయిపేట, సుబ్లేడులో బీటీ రోడ్డు, సైడ్ డ్రైన్, ట్రైబల్ వెల్ఫేర్ నూతన బాలుర హాస్టల్ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.