NLR: వేద పండితులకు మంత్రి ఆనం గుడ్న్యూస్ తెలిపారు. టీటీడీ, దేవాదాయశాఖ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలోని 590 మంది వేద పండితులు నిరుద్యోగులుగా ఉన్నారని.. వారికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే, టీటీడీ పరిధిలోని కళాశాలలు, పాఠశాలల్లో 192 పోస్టుల భర్తీపై చర్చించామని అన్నారు.