MBNR: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు ప్రనిల్ చందర్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై జిల్లా కేంద్రంలోని శివశక్తి నగర్ కమిటీ హాల్లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 15 వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్కులో నిర్వహించబోయే బీసీ మహాధర్నాను విజయవంతం చేయాలన్నారు.