KRNL: ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోయారని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. కర్నూలు సీపీఐ కార్యాలయంలో శుక్రవారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు భర్తీకై ఈనెల 14న కర్నూలు కలెక్టరేట్ ముందు నిరుద్యోగ యువతతో ధర్నా చేయిస్తామని అన్నారు.