SRD: సంగారెడ్డిలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించే బాధ్యత సంక్షేమ అధికారులదేనని కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాల నిర్వహణ, సౌకర్యాలపై శుక్రవారం ఆమె సమీక్షించారు. వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా, విద్యుత్, పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణపై దృష్టి పెట్టాలని ఆమె అధికారులకు సూచించారు.