దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ మూవీ రెండు పార్ట్‌లను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రీ రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 31న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా దీని రన్ టైం లాక్ అయింది. 5:27 గంటల నిడివితో రీ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.