TG: అదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మండలంలోని కిషన్ రావు పెట్ గ్రామపంచాయతీ పరిధిలోని శాంతినగర్ తండాలోని రహదారి కోతకు గురికావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే భారీ వర్షాలు కురిస్తే చెరువులు తెగిపోయే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.