AKP: ఈ నెల 11న పెదబొడ్డేపల్లి, బలిఘట్టం సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని నర్సీపట్నం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పారావు తెలిపారు. లైన్ చెట్ల కొమ్మలను తొలగించే నిమిత్తం శారదానగర్ 11కేవీ, కృష్ణాబజారు 11కేవీ ఫీడర్ పరిధిలో గల శారదానగర్, బ్యాంక్ కాలనీ, బలిఘట్టం, ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 2 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.