MDCL: గాజులరామరాం డివిజన్లోని ఆదర్శనగర్లో వరద నీటి ప్రవాహ సమస్యను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పరిశీలించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇళ్లలోకి నీరు చేరినట్లు సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వరదనీటి ప్రవాహ సమస్యను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరద నీటి ప్రవాహ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు.