TG: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. వరంగల్ నేతల పంచాయితీపై చర్చించినట్లు కమిటీ సభ్యుడు, ఎంపీ మల్లు రవి తెలిపారు. సమావేశంలో MLAలు, MLCలు తమ అభిప్రాయాలను వెల్లడించారని చెప్పారు. వరంగల్ నేతలతో మరోసారి చర్చించి, స్పష్టమైన నిర్ణయానికి వస్తామని తెలిపారు. కాగా.. వరంగల్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతల మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే.