VZM: బాల్య వివాహాలు చేస్తే చర్యలు తప్పవని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి కె విజయ రాజ్ కుమార్ అన్నారు. గురువారం గజపతినగరం కోర్టు ఆవరణలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వివాహ వయసును తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎస్సీ ఎస్టీలను దూసిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.