SKLM: గార మండలంలోని అంబళ్లవలసలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గణేశుడు వికట వినాయకునిగా పూజలందుకుంటున్నారు. వికటుడు అంటే భయాలను తొలగించే దైవం అని, ఈ రోజున వికట వినాయకునికి నైవేధ్యంగా ఉండ్రాళ్లు, అటుకులు పెడతారని, భక్తులు భయరహితంగా జీవించేందుకు ఆయన అనుగ్రహాన్ని కోరుతారని పూజారులు వివరించారు.