KDP: డీఎస్సీ 2025కు ఎంపికైన అభ్యర్థులకు గురువారం ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం జరగనుందని డీవో ఓ. శంషద్దీన్ బుధవారం తెలిపారు. కడప నగరంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. 17 బృందాలు పరిశీలన చేస్తాయని.. నాలుగు బృందాలకు ఒక డిప్యూటీ ఉంటారన్నారు.