CTR: వైసీపీ పాలనలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో జరిగిన అవినీతి, ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపిన డీఆర్వో మోహన్ కుమార్ గతవారం నివేదికను కలెక్టర్ సుమిత్ కుమార్కు అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నేత దొరబాబు ఫిర్యాదుపై ప్రభుత్వం ఆదేశాల మేరకు విచారణ జరిగింది. 100 మందికి పైగా అధికారులు, డైరెక్టర్లు స్టేట్మెంట్ ఇచ్చారు.