కోనసీమ: జిల్లా మండపేట మండలం పరిధిలోని జెడ్ మేడపాడు, ద్వారపూడి గ్రామాలలో వర్షాకాలంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. దీంతో వాహనదారులు, స్దానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తూ, లారీలు వేగంగా వెళ్తున్నాయని, దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.