KMR: నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగిపోతోంది. బుధవారం రాత్రి 10 గంటలకు 1,40,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 24 గేట్లను ఎత్తి 1,95,382 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం 15.006 TMCలకు చేరింది. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.