ELR: బుట్టాయిగూడెంలోని లక్ష్మీ దుర్గ, కార్తికేయ, కృష్ణ మెడికల్ స్టోర్స్‌ను జంగారెడ్డిగూడెం డ్రగ్స్ ఇన్స్పెక్టర్ షేక్ అలీ శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎటువంటి రసీదులు లేకుండా మెడికల్ కిట్స్ విక్రయిస్తున్న వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా అనేక షాపులకు విక్రయిస్తున్నట్లు ఆలీ తెలిపారు.