MHBD: పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీ ఘటనలో తొర్రూరు మండలం మడిపల్లి వాసి మృతిచెందాడు. మోత్కూరి అఖిల్ 2ఏళ్ల నుంచి ఈ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందారు. అయితే మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో DNA పరీక్షలకు పంపించి అఖిల్‌గా నిర్ధారించారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.