GNTR: రాజధాని అమరావతి భూ సమీకరణకు సంబంధించి రైతుల అభిప్రాయాలు స్వీకరించేందుకు తాడికొండ మండలం గరికపాడు గ్రామంలో శనివారం గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. భూ సమీకరణ పై రైతులు, గ్రామ ప్రజలు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలను తెలుసుకున్నారు.