సత్యసాయి: ధర్మవరం రూరల్ మండలం గొట్లూరు గ్రామ పరిధిలోని పాముల వంక బ్రిడ్జిని శనివారం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. స్థానికుల అభ్యర్థన మేరకు బ్రిడ్జిని పునర్నిర్మించాలని నిర్ణయించారు. సమస్యను ప్రభుత్వానికి నివేదించి నూతన బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. పరిశీలనలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.