E.G: కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన సేనాపతి శ్రీను (34) శుక్రవారం కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఇంట్లో మోటార్ స్విచ్ ఆన్ చేయగానే ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. కిందపడిన కుమారుడిని తల్లి పట్టుకోగా ఆమెకూ స్వల్పంగా షాక్ తగిలింది. వెంటనే స్విచ్ ఆఫ్ చేసింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.