విశాఖ జిల్లాలోని దేవదాయ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో దేవాదాయ, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. భూముల తాజా పరిస్థితులపై ఈనెల 20లోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.