KMM: సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే మట్ట రాగమయి ‘మీ ఇంటికి మీ ఎమ్మెల్యే’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ రూ.3,59,000 విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడే నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకునే ఆర్థిక సాయం పొందాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.