NGKL: అచ్చంపేట మండలంలోని దుబ్బ తండాకి చెందిన దాదాపు 30 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరుతున్నారని అన్నారు.