BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరులో శనివారం రాత్రి 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలిపారు. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఏల్చూరు టోల్ ప్లాజా అంబులెన్స్‌లో నరసరావుపేట హాస్పిటల్‌కి తరలించారు.