VZM: మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఎస్సై సన్యాసినాయుడు అన్నారు. మహిళ దినోత్సవ వారోత్సవాల సందర్బంగా డెంకాడలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆత్మ విశ్వాసమే మహిళ శక్తికి ప్రధాన ఆయుధమన్నారు. చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అందరూ శక్తి యాప్ను తమ ఫోన్లో ఉంచుకోవాలని, ఆపదలో యాప్ రక్షణగా నిలుస్తుందన్నారు.