KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి బుధవారం ఉ. 12 గంటలకు 78,406 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు.ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి 1,52,848 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 17.802 TMCలు కాగా, ప్రస్తుతం 17.441TMCలకు చేరుకుంది. నీటి ప్రవాహాల వద్ద సెల్ఫీలు దిగరాదని హెచ్చరించారు.