ASF: సిర్పూర్(టి) నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినం సందర్భంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం పొందాలని కోరారు. అలాగే వినాయక నవరాత్రులను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.