JGL: మెట్పల్లి మండలం ఆత్మకూర్‌లో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు మంగళవారం గ్రామంలో ఆందోళన చేశారు. ఇసుక రీచ్‌లో తాగు, సాగు నీటికి తీవ్ర కొరత ఏర్పడి, తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, తక్షణం దానిని రద్దు చేయాలన్నారు. ఈ విషయమై అధికారులు, నాయకులకు విన్నవించినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.